![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1023 లో.. స్టూడెంట్స్ సర్ ప్రైజ్ గా వసుధారకి బర్త్డే విషెస్ చెప్తారు. అదంతా మను ప్లాన్ అనుకుని వసు మను దగ్గరికి వెళ్లి తిడుతుంది. ఆ తర్వాత తన తప్పు లేదని తెలిసి మను దగ్గరికి వసుధార వచ్చి సారీ చెప్తుంది. మిమ్మల్ని మొదట నుండి నేను అపార్థం చేసుకుంటున్నానని వసు అనగానే... మీరు కోపంలో అలా అన్నారు.. నేనేం అనుకోవట్లేదని మను అంటాడు.
ఆ తర్వాత మీరు అలా అంటున్నారు కానీ ఖచ్చితంగా ఫీల్ అవుతారని వసుధార అంటుంది. నేను ఉన్నా పరిస్థితిలో ఇలానే ఆలోచిస్తున్నానని వసుధార అనగానే.. మీరు గిల్టీగా ఫీల్ కాకండి.. మీరు మాతో వస్తే మీకు ఆ గిల్టీ ఫీలింగ్ పోతుందని మను అంటాడు. ఎక్కడికి చెప్పండి వస్తానని వసుధార అడుగుతుంది. అక్కడకి వెళ్ళాక అక్కడ నాకు నచ్చనిది ఉంటే అప్పుడు కోప్పడాల్సి వస్తుంది. అందుకే ముందే చెప్పండి అని వసుధార అంటుంది. మీరు ఫీల్ అయ్యే అంత అక్కడ ఏం లేదు.. ఒకవేళ మీరు ఫీల్ అవుతే.. నేను ఎప్పటికి నా మొహం చుపించనని మను అంటాడు. ఆ తర్వాత వసుధారకి కళ్ళకి గంతలు కట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ స్టూడెంట్స్ అందరు రిషి ఫోటో గల ఫేస్ మాస్క్ తో ఉండేసరికి వసుధార సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. అలా రిషి ఫోటో చూసేసరికి వసుధార ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత అందరు వసుధారకి విషెస్ చెప్తారు. కాసేపటికి అక్కడికి ఫణింద్ర తన ఫ్యామిలీని తీసుకొని వస్తాడు. దేవయాని, శైలంద్రలు అలా సెలెబ్రేషన్స్ చెయ్యడం చూడలేకపోతారు. మరొకవైపు రిషి ఫేస్ మాస్క్ తో రాజీవ్ కూడా సెలెబ్రేషన్స్ లో పాల్గొంటాడు.
ఆ తర్వాత మను స్టేజిపై మాట్లాడుతు.. కాలేజీ గొప్పతనం గురించి చెప్తాడు. రిషి , వసుధారలు కాలేజీలో స్టూడెంట్స్ పై శ్రద్ధ తీసుకొని వారి గురించే ఎన్నో చేశారని మను గొప్పగా చెప్తాడు. ఇక వసుధార గురించి అందరు చెప్పినట్టుగా ఒక వీడియో రూపంలో డిస్‌ప్లే చేస్తారు. అందులో స్టూడెంట్స్, శైలంద్ర తో సహా అందరూ వీడియోలో ఉంటారు. ఆ తర్వాత రిషి ఫోటోని డిస్‌ప్లే చేస్తూ వసుధారని స్టేజి పైకి పిలిచి కేక్ కట్ చేయిస్తారు. అందరు స్టూడెంట్స్ వసుధారకి కేక్ తినిపిస్తుంటే.. నేను ఎందుకు తినిపించకూడదంటూ రాజీవ్ కూడా వసుధార దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |